త‌మిళ‌నాడులో సంచ‌ల‌నం: అర్ధ‌రాత్రి సీఎం ఆక‌స్మిక త‌నీఖీలు…

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.  ఓ వైపు అప్పుడ‌ప్పుడు సైకిల్ న‌గ‌రంలో ప్ర‌యాణం చేస్తూ స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్న స్టాలిన్ ఇప్పుడు మ‌రో కొత్త ట్రెండ్‌కు తెర‌తీశారు.  పోలీస్ స్టేష‌న్‌లో ప‌నితీరును తెలుసుకుకేందుకు అర్థ‌రాత్రి స‌మ‌యంలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి త‌నిఖీలు నిర్వ‌హించారు.  సేలం నుంచి ధ‌ర్మ‌పురికి వెళ్తుండ‌గా ఆయ‌న మ‌ధ్య‌లో అద్యామాన్‌కోటై పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి అక్క‌డ స్టేష‌న్ ప‌నితీరును రికార్డుల‌ను ప‌రిశీలించారు.  సీఎం ఇలా పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి త‌నిఖీలు చేయ‌డంతో పోలీసులు షాక్ అయ్యారు.  పోలీస్ స్టేష‌న్‌ను ఎప్పుడు నిర్మించారు.  కేసులు న‌మోద‌వుతున్న తీరు, కేసుల ప‌రిష్కారం త‌దిత‌ర విష‌యాల‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు.  ప్ర‌భుత్వం మారిన‌ప్ప‌టికీ పాత ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను కొన్నింటిని అలానే కొన‌సాగిస్తున్నారు.  పిల్ల‌ల‌కు అందించే పుస్త‌కాల‌పై మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఫుటోలు ఉండ‌గా, అలానే వాటిని పిల్ల‌ల‌కు పంపిణీ చేసి ఖ‌జానా భారం కాకుండా చూశారు.  అమ్మ క్యాంటిన్ల‌ను అలానే కొన‌సాగిస్తున్నారు.  ఖ‌జానాపై భారం ప‌డ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటూ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు సీఎం స్టాలిన్‌.  

Read: బ‌ద్వేల్ ఉప ఎన్నికలో విజయంపై టీడీపీ ధీమా…

-Advertisement-త‌మిళ‌నాడులో సంచ‌ల‌నం:  అర్ధ‌రాత్రి సీఎం ఆక‌స్మిక త‌నీఖీలు...

Related Articles

Latest Articles