మంత్రి కేటీఆర్ ను కలిసిన తమిళనాడు ఎంపీలు

డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఇవాళ మంత్రి కేటీఆర్‌ ను కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఈ సందర్భంగా కేటీఆర్ కు అందచేశారు డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎం లకు లేఖ రాశారు స్టాలిన్. ఆ లేఖనే ఇవాళ మంత్రి కేటీఆర్‌ కు అందజేశారు.

ఈ సందర్భంగా DMK ఎంపీ ఇలన్ గోవన్ మాట్లడుతూ.. నీటి పరీక్ష రద్దు అంశం పై కేటీఆర్ ను కలిసామని… విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నీటి పరీక్ష అంశం పై మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర విధానంపై తాము నిరసన చేస్తున్నామని… తమకు సపోర్ట్ చెయ్యాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆడిగామన్నారు. కేంద్రం కీలకమైన విషయాలలో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదని చెప్పారు. అటు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. Dmk ఎంపీలు కేటీఆర్ ను కలిశారని… లెటర్ తీసుకొచ్చి కేటీఆర్ కి స్వయంగా అందించి సపోర్ట్ అడిగారన్నారు.

-Advertisement-మంత్రి కేటీఆర్ ను కలిసిన తమిళనాడు ఎంపీలు

Related Articles

Latest Articles