మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగించిన త‌మిళ‌నాడు

క‌రోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో త‌గ్గుముఖం ప‌ట్టినా.. మ‌రికొన్ని రాష్ట్రాల‌ను మాత్రం ఇంకా టెన్ష‌న్ పెడుతూనే ఉంది.. దీంతో.. క‌రోనా క‌ట్ట‌డికి కోసం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వ‌స్తున్నాయి ఆయా రాష్ట్రాలు.. తాజాగా, త‌మిళ‌నాడు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించింది.. జూన్ 7 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది త‌మిళ‌నాడు స‌ర్కార్.. ప్ర‌స్తుత లాక్‌డౌన్ కు ఎలాంటి స‌డ‌లింపులు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్.. నిత్యావ‌స‌రాల‌కు సంబంధించిన దుకాణాలు ఉద‌యం 7 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కూ ఆర్డ‌ర్లు తీసుకుని.. స‌రుకుల‌ను నేరుగా క‌స్ట‌మ‌ర్ల ఇంటికి చేర్చేందుకు అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో.. రేష‌న్ కార్డుదారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం స్టాలిన్. జూన్ నెల‌లో రేష‌న్ షాపుల ద్వారా కార్డుదారుల‌కు 13 నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌తో కూడిన కిట్‌ను అంద‌జేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-