కోవిడ్‌ ఉగ్రరూపం..! టెస్ట్‌ చేసిన తర్వాతే ఎంట్రీ

భారత్‌లో కరోనా కేసులు ప్రతీరోజు 40 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి.. ఇక, ఈ కేసుల్లో అగ్రభాగం మాత్రం కేరళ రాష్ట్రానిదే.. సెకండ్‌ వేవ్‌ వెలుగుచూసినప్పట్టి నుంచి కేరళలో కోవిడ్‌ కంట్రోల్‌లోకి వచ్చింది లేదు.. అయితే, ఆ రాష్ట్రంలో కోవిడ్‌ ప్రారంభమైన తొలినాళ్లలో తీసుకొచ్చిన కరోనా ట్రేసింగ్‌ విధానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు చేయడమే.. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు.. ఆ రాష్ట్రంలో కోవిడ్‌ ఉగ్రరూపం కొనసాగుతుండడంతో.. కేరళ సరిహద్దుల్లో టెస్ట్‌లు చేపడుతున్నారు.. కేరళ సరిహద్దు ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు కేరళ నుంచి వచ్చే ప్రతివాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు తమిళనాడు అధికారులు.. వాహనాల్లో వచ్చేవారందరికీ థర్మల్‌స్కాన్‌ చేస్తున్నారు. రెండు డోసుల టీకా వేసుకున్నట్లు ధ్రువపత్రాలతో వచ్చేవారిని మాత్రం ఎలాంటి పరీక్షలు చేయకుండా రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.. రాకపోకలు సాగించేవారితో కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక వైద్యపరీక్షల శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఓవైపు కేరళ అధికారులు.. మరోవైపు తమిళనాడు అధికారులు టెస్ట్‌లు చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-