మొత్తానికి ఆ హీరోయిన్.. మరక పోగొట్టుకుంది!

తమిళ నటి రైజా విల్సన్‌ గతంలో ఫేషియల్‌కోసం వెళ్లగా అది వికటించడంతో అందవిహీనంగా అయిన విషయం తెలిసిందే. దీంతో తన ముఖం పాడైందని ఫొటోలు కూడా షేర్‌ చేసింది. కంటి కింద వాపు కూడా వచ్చిందని పేర్కొంది. దీనికి కారణమైన చెన్నై చర్మనిపుణులు భైరవి సెంతిల్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, తన అందం పోగొట్టినందుకు వైద్యురాలు కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇదిలావుంటే, అనూహ్యంగా రైజా విల్సన్‌ మళ్లీ తన అందంను దక్కించుకుంది. మునుపటి మాదిరిగానే ఆమె ప్రకాశిస్తూ కనిపిస్తుంది. పూర్తిగా ఆమె కంటి కింద అయిన నల్ల మరక తొలగిపోయింది. ప్రస్తుత ఆమె కొత్త లుక్ ను అభిమానులతో పంచుకుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-