ఐటమ్ కోసం తమ్ముకి 75 లక్షలు

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ మూడు సినిమాలు నాలుగు డబ్బులు గా సాగుతోంది. కెరీర్ మొదలెట్టి పదేళ్ళకు పైగా అయినా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా సోలో హీరోయిన్ గా రాణిస్తూనే ఐటమ్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా ‘ఎఫ్-3’, ‘సిటీ మార్’, ‘మ్యాస్ట్రో’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తోంది. కెరీర్ లో ఇంత బిజీగా ఉండి కూడా ఐటమ్ సాంగ్స్ కు సై అంటూ ముందుకు సాగుతోంది తమన్నా. జై లవకుశ, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలతో పాటు అంతకు ముందు వచ్చిన ‘జాగ్వార్’ వంటి సినిమాల్లో చిందేసింది తమ్ము.

Read Also : ‘అర్జున్ రెడ్డి’ని వద్దని బాధ పడుతున్న పార్వతి

తాజాగా ఇప్పుడు మరో హాట్ ఐటెమ్ నంబర్ లో నటించబోతంది. వరుణ్ తేజ్ గని సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ లో మెరవబోతందట. ఈ పాట కోసం అమ్మడికి 75 లక్షలు పారితోషికం ఇవ్వనున్నారట. కోటి డిమాండ్ చేసినా చివరికి 75 లక్షలకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఐదు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరిస్తారట. ఉపేంద్ర, సునీల్ శెట్టి, సాయి మంజ్రేకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు బాబి నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు.

-Advertisement-ఐటమ్ కోసం తమ్ముకి 75 లక్షలు

Related Articles

Latest Articles