ఆ పని కూడా వదలనంటున్న తమన్నా!

మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే “లెవెన్త్ అవర్” అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి అక్కడ అంతగా ఆదరణ లభించలేదు. మొట్టమొదటి వెబ్ సిరీస్ తోనే బ్యాక్ లక్ అనిపించుకున్న ఈ భామ ఆ వెంటనే మరో వెబ్ సిరీస్ “నవంబర్ స్టోరీ”తో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈసారి మాత్రం తమన్నా నటనకు ప్రశంసలు కురిశాయి. “నవంబర్ స్టోరీ” హిట్ టాక్ తో నడిచింది. ఇక సినిమాల విషయానికొస్తే… ఈ స్టార్ హీరోయిన్ నటించిన సీటిమార్, ఎఫ్ 3 చిత్రాలు ఈ ఏడాది చివర్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు తన అందం, అభినయంతో అలరించిన తమన్నా ఇప్పుడు డబ్బింగ్ కూడా చెప్తా అంటోంది. సీటిమార్, ఎఫ్ 3 చిత్రాలలో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఈ విషయాన్ని తమన్నా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. తానే స్వయంగా చెప్పడం వల్ల తన పాత్రలకు పరిపూర్ణత ఎలా వస్తుందో గ్రహించానని, అంతేకాదు తన గొంతుతో డబ్బింగ్ చెప్పడం వల్ల చాలా మార్పు కన్పిస్తుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. సీటీమార్, ఎఫ్ 3 తో ​​పాటు, నితిన్ ‘మాస్ట్రో’లో కూడా తమన్నా నటిస్తోంది. ఈ రీమేక్‌లో బాలీవుడ్ నటి టబు పాత్రలో కనిపించనుంది తమన్నా.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-