‘అంధాధున్’ రీమేక్ పై తమన్నా కీలక నిర్ణయం!

హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ కు రీమేక్‌గా తెలుగులో ‘మాస్ట్రో’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తుండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌కు జోడీగా నభా నటేష్‌ నటిస్తోంది. తమన్నా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. అయితే ‘అంధాధున్‌’ సినిమాలోని టబు పాత్ర పోషిస్తున్న తమన్నా రీసెంట్ గా స్పందించింది. ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నానని తెలిసినప్పటి నుంచి, దాని ఒరిజినల్​ చూడకూడదని నిర్ణయించుకున్నట్లు తమన్నా చెప్పింది. తెలుగులో తాను మరింత కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపింది. అందుకే దాని ఒరిజినల్​ చూడకూడదని నిర్ణయించుకున్నట్లు నిర్ణయం తీసుకుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-