చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను: తమన్నా

కరోనా కష్టకాలంలో నిరుపేదలకు సాయం చేసేందుకు చాలా మంది సినీ సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన వంతు సాయంపై స్పందించింది. ‘సినిమా వాళ్లు సేవా కార్యక్రమాలు చేయడం లేదనే అపోహను ఆమె తిప్పికొట్టింది. ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా మాత్రం తాను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. తాను చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను అని తెలిపింది. సినీ తారల దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటుందని, వారు ఎక్కడికి వెళ్ళినా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారనే అపోహలు అందరూ నమ్మాల్సిన అవసరం ఉందని’ చెప్పింది. ఇక తమన్నా సినిమా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన ‘సీటీమార్’, నితిన్ హీరోగా వస్తోన్న హిందీ రీమేక్ ‘అంధాదున్’ చిత్రంలో తమన్నా నటిస్తున్నారు. ఇక ‘ఎఫ్ 3’ సినిమాతో తమన్నా మళ్లీ నవ్వులు పూయించేందుకు రెడీగా ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-