‘గని’ కోసం బాక్సింగ్ రింగులోకి దిగిన మిల్కీ బ్యూటీ..

మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ లో కనిపించడం కొత్తేమి కాదు.. ‘కెజిఎఫ్’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘జై లవకుశ’ చిత్రాల్లో అమ్మడి ఐటెం సాంగ్స్ ఓ రేంజ్ లో దుమ్మురేపాయి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఐటెం సాంగ్ తో పిచ్చిలేపింది. మెగాహీరో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్, పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక తాజాగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్. ‘రింగారే రింగా రింగా .. రింగా రింగా’ అంటూ సాగే ఈ పాటలో తమన్నా డాన్స్ అదరగొట్టేసింది. ఇక అమ్మడి అందాలతో పాటు సీతారామశాస్త్రి లిరిక్స్, హారిక నారాయణ్ హస్కీ వాయిస్ సాంగ్ ని హైలైట్ గా చేశాయి. బాక్సింగ్ రింగులో గని గెలుపు కోసం ఎదురుచూస్తున్న అభిమానుల తరపున తమన్నా మోటివేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ లో వరుణ్ బాలీవుడ్ హీరో సుని శెట్టి కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ శోకాలు మీడియాను షేక్ చేస్తోంది. త్వరలోనే గని రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించనున్నారు.

Related Articles

Latest Articles