హ‌నుమంతుడి జ‌న్మస్థ‌లంపై కొన‌సాగుతున్న చర్చ‌లు…పూర్తి నివేదిక ఇస్తేనే…

హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లంపై వాడి వేడిగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం అంజ‌నాద్రి అని టిటిడీ ఇప్ప‌టికే పేర్కోన్న‌ది.  దాన‌కి సంబందించిన ఆధారాల‌ను కూడా టీటీడి స‌మ‌ర్పించింది.  అయితే, హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లంపై టీటీడి చూపించిన ఆధారాల‌లో ప‌లు తప్పులు ఉన్నాయ‌ని హ‌నుమాన్ తీర్ధ‌క్షేత్ర ట్రస్ట్ పేర్కోన్న సంగ‌తి తెలిసిందే.  దీనిపై ఈరోజు తిరుప‌తిలోని సంస్కృత విధ్యాపీఠంలో  టీటీడి పండితులకు, హ‌నుమాన్ తీర్థ‌క్షేత్ర ట్ర‌స్ట్ కు చెందిన గోవిందానంద స‌ర‌స్వ‌తి స్వామీజీకి మద్య వాడి వేడి చ‌ర్చ‌లు జరుగుతున్నాయి.  టిటిడీ చూపించిన ఆధారాల‌లో ప‌లు త‌ప్పులను ఎత్తి చూపించారు గోవిందానంద స‌ర‌త్వ‌తి.  టిటిడి పూర్తి స్థాయి నివేదిక‌ను అందిస్తే మ‌రిన్ని త‌ప్పులు చూపిస్తాన‌ని గోవిందానంద స‌ర‌స్వ‌తి స్వామీజీ చెబుతుండ‌గా, పూర్తి నివేదిక ఇవ్వడం కుద‌ర‌ద‌ని టిటిడీ అధికారులు అంటున్నారు.  దీంతో చర్చ‌లు సందిగ్దంలో ప‌డిపోయాయి.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-