తాలిబ‌న్ల విజ‌యం వారికి మ‌రింత బ‌లాన్నిస్తుందా…?

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్లు రెండోసారి అధికారంలోకి వ‌చ్చారు.  1996 నుంచి 2001 వ‌ర‌కు తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌లో అరాచ‌క పాల‌న సృష్టించారు.  ఈ పాల‌న త‌రువాత, అమెరికా ద‌ళాలు ఆఫ్ఘ‌న్‌లోని ముష్క‌రుల‌పై దాడులు చేసి తాలిబ‌న్ల‌ను త‌రిమికొట్టి ప్ర‌జాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు.  20 ఏళ్ల‌పాటు అమెరికా, నాటో ద‌ళాలు అక్క‌డే ఉన్నాయి.  2021 ఆగ‌స్టు 31 వ‌ర‌కు పూర్తిగా అమెరిక‌న్ ద‌ళాలు ఆఫ్ఘ‌న్‌ను వ‌ద‌లి వెళ్లిపోయాయి.  దీంతో మ‌రోసారి తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకున్నారు. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నారు. తాలిబ‌న్లు త‌మ బలాన్ని మ‌రోసారి ప్ర‌పంచానికి చాటిచెప్పాయి.  తాలిబ‌న్ల విజ‌యంతో మ‌రోసారి ప్ర‌పంచంలోని వివిధ ర‌కాల ఉగ్ర‌మూక‌లు రెచ్చిపోయే అవ‌కాశం ఉన్న‌ట్టు ఐరాస ఆందోళ‌న చెందుతున్న‌ది.  ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఉగ్ర‌మూక‌లు ఇప్ప‌టికే చెల‌రేగిపోతున్నాయి.  సిరియా, ఇరాక్ తో పాటుగా మ‌రికొన్ని ప్రాంతాల్లో కూడా ఉగ్ర‌దాడులు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఐరాస ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ది.  

Read: బీజేపీకి ఆ భ‌యం ప‌ట్టుకుందా… అందుకే మార్పులు చేస్తున్నారా?

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-