ఆఫ్ఘ‌న్ మాజీ నేత‌ల ఇళ్ల‌ల్లో తాలిబ‌న్ల సోదాలు…భారీగా బ‌య‌ట‌ప‌డ్డ క‌రెన్సీ…

ఆఫ్ఘ‌నిస్తాన్ మొత్తం ఇప్పుడు తాలిబ‌న్ల వ‌శం అయింది.  అక్క‌డ తాలిబ‌న్ల ప్ర‌భుత్వం ఏర్పాటైంది.  ప్ర‌స్తుతం తాత్కాలిక ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా, పూర్తిస్తాయిలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ‌దేశాల గుర్తింపు పొందేందుకు ప్ర‌యత్నం చేస్తున్నారు.  అయితే, తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని గుర్తించ‌కుంటే ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉన్న‌ది.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని గుర్తించేందుకు కొన్నిదేశాలు ఇప్ప‌టికే సిద్ధంగా ఉన్నాయి.  ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆఫ్ఘ‌నిస్తాన్ తాత్కాలిక ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.   గ‌త ప్ర‌భుత్వంలోని మాజీనేత‌ల ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హిస్తోంది.  ఇందులో భాగంగా ఆఫ్ఘ‌న్ మాజీ అధ్య‌క్షుడు అమ్రుల్లా స‌లేహ్ ఇంటిపై దాడులు చేశారు.  ఈ సోదాల్లో సలేహ్ ఇంట్లో 6 మిలియ‌న్ డాల‌ర్ల డబ్బు, 18 పెద్ద బంగారు బిస్కేట్లు దొరికిన‌ట్టు తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు.  దీనికి సంబందించిన వీడియో వైర‌ల్‌గా మారింది.  మ‌రికొంత‌మంది నేత‌ల ఇళ్ల‌పై కూడా తాలిబ‌న్లు సోదాలు చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. 

Read: ఇజ్రాయిల్ అద్భుత సృష్టి: సరిహద్దుల్లో సాయుధ‌రోబోలు…

Related Articles

Latest Articles

-Advertisement-