ఆఫ్ఘ‌న్ అంత‌ర్యుద్ధం: 700 మంది తాలిబ‌న్లు హ‌తం…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో అంత‌ర్యుద్ధం జ‌రుగుతున్న‌ది. ఎలాగైనా పంజ్‌షీర్ ప్రావిన్స్‌ను అక్ర‌మించుకోవాల‌ని తాలిబ‌న్లు చూస్తున్నారు.  తాలిబ‌న్ల‌కు పంజ్‌షీర్ మాత్ర‌మే కాకుండా, వారి చెర నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్ మొత్తాన్ని విడిపించాల‌ని పంజ్‌షీర్ ద‌ళం పోరాటం చేస్తున్నది.  పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి.  ఈ ఎనిమిది జిల్లాల‌లో పెద్ద ఎత్తున తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాటం జ‌రుగుతున్న‌ది.  అయితే, తాము పంజ్‌షీర్‌లోని 4 జిల్లాల‌ను ఆక్ర‌మించుకున్నామ‌ని,  పంజ్‌షీర్ రాజ‌ధాని బ‌జార‌క్ లోని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంలోకి కూడా ప్ర‌వేశించామ‌ని తాలిబ‌న్లు చెబుతుంటే, పంజ్‌షీర్ త‌మ ఆధీనంలోనే ఉంద‌ని, త‌మ చేతిలో 700 మంది వ‌ర‌కు తాలిబ‌న్లు మ‌ర‌ణించారని, వెయ్యిమందిని బంధీలుగా ప‌ట్టుకున్నామ‌ని చెప్పారు. తాలిబ‌న్ల‌కు లొంగిపోయేది లేద‌ని, చివ‌రి ఊపిరి వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని నేష‌న‌ల్ రెసిస్టెంట్ ఫ్రంట్ బ‌ల‌గాలు చెబుతున్నాయి.  

Read: అల‌ర్ట్‌: తెలుగు రాష్ట్రాల్లో మ‌రో కొత్త వేరియంట్‌… అప్ర‌మత్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-