ఆఫ్ఘ‌న్‌లో రెచ్చిపోతున్న ఉగ్ర‌వాదులుః కీల‌క ప్రాంతాలు స్వాదీనం…

అఫ్ఘ‌న్ నుంచి అమెరికా త‌న బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డంతో మ‌ళ్లీ ఆ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు.  దాదాపు రెండు ద‌శాబ్ధాల‌పాటు ఆఫ్ఘ‌న్‌లో అమెరికా బ‌ల‌గాలు మోహ‌రించి ఉగ్ర‌వాదుల కార్య‌క‌లాపాల‌ను అణిచివేశాయి.  ఎప్పుడైతే ఆ దేశం నుంచి అమెరికా త‌న బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం మొద‌లు పెట్టిందో అప్ప‌టి నుంచే తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌లోని కీల‌క ప్రాంతాల‌ను స్వాదీనం చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు.  ద‌క్షిణ ప్రాంతాల‌పై ఇప్ప‌టికే ప‌ట్టుబిగించిన తాలిబ‌న్లు, ఆ ప్రాంతంలో కీల‌క‌మైన కాంద‌హార్ ను ఆదీనంలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టింది.

Read: “ఏజెంట్” రెడీ అవుతున్నాడు… మరి మీరు ?

 కాంద‌హార్ తాలిబ‌న్ల‌కు కీల‌క‌మైన స్థావ‌రం.  గ‌తంలో ఈ న‌ర‌గంపై ఉగ్ర‌వాదుల‌కు ప‌ట్టు ఉండేది.  ఇప్పుడు మ‌రోసారి ఆ న‌గ‌రాన్ని స్వాదీనం చేసుకోబుతున్న‌ది.  ఇప్ప‌టికే ప్ర‌జ‌లు అంత‌ర్యుద్ధంతో అతలాకుత‌లం అవుతున్నారు.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని కీల‌క ప్రాంతాలు తాలిబ‌న్ల చేతిలోకి వెళ్తె, అక్క‌డి ప్ర‌జ‌లు మ‌రింత దుర్భ‌ర జీవితాన్ని గ‌డ‌పాల్సి వ‌స్తుంది.  కాంద‌హార్‌లో ఉన్న భార‌త కాన్సులేట్ కార్యాల‌యాన్ని మూసివేసి దౌత్యాధికారులు ప్ర‌త్యేక విమానంలో భార‌త్ కు చేరుకున్నారు. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-