కశ్మీర్‌పై తాలిబన్ల యూటర్న్‌.. అది మా హక్కు..!

తాలిబన్లు అంతే.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి.. తాజాగా, జమ్మూ కశ్మీర్‌ విషయంలో యూటర్న్‌ తీసుకున్నారు తాలిబన్లు.. మొదట్లో క‌శ్మీర్.. భారత్‌-పాకిస్థాన్‌ అంత‌ర్గత విష‌య‌మ‌ని.. అది ఆ రెండు దేశాల ద్వైపాక్షిక అంశమని చెప్పుకొచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు మాట మార్చారు.. ముస్లింలుగా క‌శ్మీర్‌, భారత్‌ స‌హా ఏ దేశంలోని ముస్లింల కోస‌మైనా గ‌ళ‌మెత్తే హ‌క్కు మాకు ఉంది అంటూ ప్రకటించారు.. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబ‌న్ అధికార ప్రతినిధి సుహైల్ ష‌హీన్.. ముస్లింలుగా ఏ దేశంలోని ముస్లింల కోస‌మైనా గ‌ళ‌మెత్తే హ‌క్కు మాకు ఉందన్నారు. అయితే, ఏ దేశంపైనా తాము ఆయుధాలు ఎక్కుపెట్టబోమ‌ని కూడా స్పష్టం చేశారు.

తాలిబాన్ పాలనలో ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగం భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందనే భారతదేశ ఆందోళన మధ్య, కాశ్మీర్‌తో సహా ఎక్కడైనా ముస్లింల కోసం తమ స్వరాన్ని పెంచే హక్కు తమకు ఉందని తాలిబన్లు ప్రకటించడం మరింత ఆందోళనకు గురిచేసేలా తయారైంది.. మేం మా స్వరాన్ని పెంచుతాం.. ముస్లింలు మీ స్వంత ప్రజలు, మీ స్వంత పౌరులు అని చెబుతామని… మీ చట్టాల ప్రకారం వారికి సమాన హక్కులు ఉంటాయి అని వ్యాఖ్యానించారు.. షహీన్ వ్యాఖ్యలు కాశ్మీర్‌పై తాలిబన్లు గతంలో చేసిన ప్రకటనలకు భిన్నంగా ఉన్నాయి. కాబూల్ నియంత్రణలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత, తాలిబాన్లు కాశ్మీర్ ఒక ద్వైపాక్షిక మరియు అంతర్గత విషయం అని చెప్పారు. కానీ, ఇప్పుడు మాట మార్చారు.. ఇక, ఆఫ్ఘన్‌ భూభాగం ఏ విధమైన ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించబడకుండా చూడటమే భారతదేశ లక్ష్యమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

Related Articles

Latest Articles

-Advertisement-