కాలువ‌పాలైన మూడువేల లీట‌ర్ల మ‌ద్యం… ఎక్క‌డంటే…

ఏ దేశంలో అయినా మ‌ద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయ‌లుగా సాగుతుంది.  ప్ర‌భుత్వాల‌కు అధిక ఆధాయం తెచ్చిపెట్టే వాటిల్లో మ‌ద్యం ఒక‌టి. అయితే, కొన్ని దేశాల్లోని ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మ‌ద్య‌పానంపై నిషేధం విధిస్తుంటాయి. అయితే, తాలిబ‌న్ ఏలుబ‌డి ఉన్న ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఇస్లామిక్ చ‌ట్టాల‌కు లొబ‌డి మ‌ద్యం పై నిషేధం విధించింది.  ఆఫ్ఘనిస్తాన్‌లో మ‌ద్యం సేవించినా, అమ్మినా నేరం.  ఇలాంటి నేరాల‌తో ప‌ట్టుబ‌డితే వారికి క‌ఠిన శిక్ష‌లు విధిస్తారు.  ఇక ఇదిలా ఉంటే, ఇటీవ‌లే అక్క‌డి తాలిబ‌న్ ఇంటిలిజెన్స్ అధికారులు మూడు వేల లీట‌ర్ల అక్ర‌మ మ‌ద్యాన్ని ప‌ట్టుకున్నారు.  అలా ప‌ట్టుకున్న మ‌ద్యాన్ని కాలువ‌లో పార‌బోశారు.  

Read: కోవిడ్ ఎఫెక్ట్‌: జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు నుమాయిష్ నిలిపివేత‌…

ఈ విష‌యాన్ని తాలిబ‌న్ ప్ర‌భుత్వం ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.  మ‌ద్యం అమ్మకాల‌కు తాము వ్య‌తిరేక‌మ‌ని, ఇస్లాం చ‌ట్టాల ప్ర‌కారం మ‌ద్యం అమ్మకాలు జ‌రిపితే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. గ‌తేడాది ఆగ‌స్ట్ 15 వ తేదీన తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను వారి అధీనంలోకి తీసుకున్నారు.  సెప్టెంబ‌ర్ 1 నుంచి ఆ దేశంలో పాల‌న జ‌రుపుతున్నారు.  తాలిబ‌న్లు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అక్క‌డి మ‌హిళ‌లు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్ల‌దీస్తున్నారు.  ఉద్యోగాలు లేక‌, స‌రైన ఆహారం దొర‌క్క ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు.  మాన‌వ‌తా హృద‌యంతో భార‌త్ ఆహార‌ధాన్యాలు, కోవిడ్ వ్యాక్సిన్‌ల‌ను ఆఫ్ఘ‌న్‌కు అందించిన సంగ‌తి తెలిసిందే.  

Related Articles

Latest Articles