మొద‌లైన తాలిబ‌న్ పాల‌న‌: 2.0 లోనూ మ‌హిళ‌ల ప‌రిస్థితి అంతేనా..!!

తాలిబ‌న్ల కొత్త ప్ర‌భుత్వం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కొలువుదీరిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  మ‌హిళ‌ల‌ను గౌర‌విస్తామ‌ని ఇప్ప‌టికే తాలిబ‌న్లు అనేక‌మార్లు ప్ర‌క‌టించారు.  వాళ్లు చెబుతున్న మాట‌ల‌కు, చేత‌ల‌కు ఏ మాత్రం పొందిక‌లేద‌ని మ‌రోమారు స్ప‌ష్టం అయింది.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని హెరాత్‌లో నిన్న‌టి రోజున 50 మంది మ‌హిళ‌లు రోడ్డుపైకి వ‌చ్చి నినాదాలు చేసిన సంగ‌తి తెలిసిందే.  మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వంలో అవ‌కాశం క‌ల్పించాల‌ని, మ‌హిళ‌లు లేకుండా ప్ర‌భుత్వం ముందుకు సాగ‌లేద‌ని పేర్కొన్నారు.  అలా మ‌హిళ‌లు రోడ్డుపైకి వ‌చ్చి నిర‌స‌లు చేస్తుండ‌గా తాలిబ‌న్లు వ‌చ్చి మ‌హిళ‌ల ద‌గ్గ‌ర‌నుంచి ప్ల‌కార్డులు లాక్కున్నారు.  వారిపై దౌర్జ‌న్యానికి దిగారు.  తాలిబ‌న్లు ఓపిక వ‌హించాల‌ని, మారిపోయార‌ని చెప్పే మాటలు చేత‌ల్లో చూపించాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.  అనేక ప్రాంతాల్లో ప్ర‌చార బోర్డుల‌పై ఉన్న మ‌హిళ‌ల చిత్రాల‌ను తొల‌గించేందుకు ఒత్తిడి తీసుకురావ‌డంతో బ్యూటీపార్ల‌ర్ షాపుల యజ‌మానులు మ‌హిళ‌ల ప్ర‌చార చిత్రాల‌పై రంగులు వేసి తొల‌గించారు.  

Read: రూపాయికే ఇడ్లీ… మూడు చెట్నీల‌తో స‌హా…ఎక్క‌డో తెలుసా..!!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-