తాలిబ‌న్ల అదుపులో ఆ భ‌వ‌నం… మ‌హిళ‌ల‌కు ఇక న‌ర‌క‌మే….

తాలిబ‌న్లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.  స‌మీకృత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని, అంద‌రికి స‌మాన‌మైన గుర్తింపు ఇస్తామ‌ని, ప్ర‌భుత్వంలో అన్ని వ‌ర్గాల వారిని క‌లుపుకొని పోతామ‌ని చెప్పిన తాలిబ‌న్లు దానికి విరుద్ధంగా చేశారు.  ఒక్క మ‌హిళ‌కు కూడా మంత్రి వ‌ర్గంలో స్థానం ఇవ్వ‌లేదు.  పైగా మ‌హిళ‌లు ఇంటికే ప‌రిమితం కావాల‌ని, రాజ‌కీయాల్లోకి వారి అవ‌స‌రం లేద‌ని చెప్ప‌క‌నే చెప్పారు.  బాలిక‌ల చ‌దువుకు 1-5 త‌ర‌గ‌తుల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తించారు.  దీంతో మ‌హిళ‌ల ప‌ట్ల తాలిబ‌న్ల‌కు ఎలాంటి దృష్టి ఉన్న‌దో అర్ధం అవుతున్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, ప్ర‌పంచ బ్యాంకు 100 మిలియ‌న్ డాల‌ర్లతో మ‌హిళా సాధికారిక‌త‌, గ్రామీణాభివృద్ధి కోసం మ‌హిళా మంత్రిత్వ‌శాఖ‌ను ఏర్పాటు చేసింది.  కాగా, ఈ భ‌వ‌నాన్ని ఇప్పుడు తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నారు.  అందులో ఉన్న సిబ్బందిని బ‌య‌ట‌కు పంపించేశారు.  ఈ భ‌వ‌నాన్ని మ‌త‌ధ‌ర్మ‌ప్ర‌చారం కోసం వినియోగించ‌బోతున్నారు.  ష‌రియా చ‌ట్టాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేసేందుకు ఈ శాఖ ప‌నిచేస్తుంది.  ఎవ‌రైనా స‌రే ష‌రియా చ‌ట్టాలను వ్య‌తిరేకిస్తే వారికి అక్క‌డిక‌క్క‌డే శిక్ష‌లు విధించేందుకు ఈ సంస్థ ప‌నిచేస్తున్న‌ది.  ష‌రియా చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించే వారిపై నిఘా వ్య‌వ‌స్థగా ఈ మ‌త‌ధ‌ర్మ‌శాఖ ప‌నిచేస్తుంది. ఇప్ప‌టికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆఫ్ఘ‌న్ మ‌హిళ‌లు, ఇప్పుడు మ‌రిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.  

Read: ఎంపీటీసీలో వైసీపీ దూకుడు…

Related Articles

Latest Articles