పంజ్‌షీర్‌లో ఎగిరిన తాలిబన్ల జెండా.. కానీ..

దొంగదెబ్బ.. వెన్నుపోటు. పాకిస్థాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాలిబన్లతో ఎలాంటి సంబంధం లేదని పైకి చెబుతూనే వాళ్ల తరఫున యుద్ధం చేసేందుకు ఉగ్రవాదులను పంపింది పాక్‌. పంజ్‌ షీర్‌ సింహాలను నేరుగా ఢీకొట్టలేని తాలిబన్లు.. కుట్రలమారి పాకిస్థాన్‌ అండ తీసుకున్నారు. యుద్ధంలో తామే గెలిచా మని పంజ్‌ షీర్‌లో జెండా ఎగరేశారు. పంజ్ షీర్‌ గవర్నర్‌ బంగ్లా దగ్గర తాలిబన్‌ నేతలు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. దాని కొండ ప్రాంతంలోని లోయల్లో మాత్రం భీకర యుద్ధం నడుస్తోది. పచ్చటి ప్రకృతి సౌందర్యాలపై రక్తం చిల్లిపడుతోంది. బాంబు దాడుల్లో… తుపాకీ బుల్లెట్ల వర్షంలో మనుషుల దేహాలు ముక్కలైపోతూనే ఉన్నాయి. గడిచిన వారం రోజుల నుంచి తాలిబన్లతో పంజ్ షీర్‌ యోధులు భీకరంగా పోరాడుతున్నారు.

ప్రపంచ దేశాలు మొండి చేయి ఇవ్వండంతో పంజ్‌షీర్‌లోని ఉత్తరాది తిరుగుబాటు దళాలు తాలిబన్లతో పోరాడి అలసిపోతున్నాయి. పద్మవ్యూహం లాంటి పంజ్‌ షీర్‌లోకి వెళ్లేందుకు గడిచిన రెండు వారాలుగా తీవ్రంగా ప్రయత్నించిన తాలిబన్లు.. ఎట్టకేలకు చేరుకోగలిగారు. భారీ భారీ బలగాల తోపాటు మందుగుండు సామాగ్రిని వెంట తీసుకెళ్లారు. తాలిబన్ల ఎంట్రీతోనే పంజ్ షీర్‌లో ఉన్న బలగాలు కొండ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. కొండల్లోని ఉత్తరాది బలగాలు.. కొండ కింది భాగం నుంచి తాలిబన్లు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. పంజ్‌ షీర్‌ యోధులు కొండ ప్రాంతంలోకి వెళ్లడంతోనే తాలిబన్‌ లీడర్లు పంజ్‌ షీర్‌లో ప్రత్యక్షమయ్యారు. గవర్నర్‌ కోటపైన తాలిబన్ల జెండాను ఎగురువేసి పంజ్‌ షీర్‌ తమ ఆధీనంలోకి వచ్చిందని ప్రకటించేశారు. ఇటు ఆప్ఘనిస్థాన్‌ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్‌ ఇంటిని బాంబులతో పేల్చేశారు. పంజ్‌ షీర్‌ బలగాలకు నాయకుడిగా ఉన్న అహ్మద్‌ మసౌద్‌ కూడా ఇప్పుడు కొండ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. అయితే, ఓ ఆడియోల రిలీజ్‌ చేశారు పంజ్‌షీర్‌ నేత అహమ్మద్‌ మస్సౌద్.. 19 నిమిషాల పాటు ఉన్న ఆ సుదీర్ఘ ఆడియోలో.. తాలిబ‌న్లపై దేశ‌మంతా తిర‌గ‌బ‌డాల‌ని పిలుపునిచ్చారు.. త‌మ ద‌ళాల‌పై మిలిటెంట్లు దాడి చేశార‌ని, మ‌త‌పెద్దల సూచ‌న‌ల‌ను కూడా తాలిబ‌న్లు ప‌ట్టించుకోలేదన్న ఆయన.. తాలిబన్ల దాడుల్లో త‌న స్వంత కుటుంబీకులు కూడా మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు. ఇక, తాలిబ‌న్లకు గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రపంచ దేశాల‌ను తప్పుబట్టిన మస్సౌద్.. సైన్యాన్ని, రాజ‌కీయ విశ్వాసాన్ని తాలిబన్లకు కల్పిస్తున్న దేశాలపై మండిపడ్డాడు.. అయితే, పంజ్‌షీర్‌లో త‌మ ద‌ళాలు ఇంకా బ‌లంగా ఉన్నాయ‌ని, తాలిబ‌న్లతో పోరాడుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-