తాలిబ‌న్ ప్రభుత్వంలో అన్ని వ‌ర్గాల‌కు అంటే అర్ధం ఇదే… తాలిబ‌న్ ఫైవ్‌కు చోటు…

తాలిబ‌న్ల ప్ర‌భుత్వం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కొలువుదీరింది.  స‌మ్మిళిత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని, అంద‌రిని స‌మానంగా గౌర‌విస్తామ‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు.  అయితే, ప్ర‌భుత్వం ఏర్పాటు విష‌యంలో తాలిబ‌న్లు చెప్పింది ఒక‌టి చేసింది ఒక‌టిగా మారింది.  తాలిబ‌న్ ప్ర‌భుత్వంలో అన్ని వ‌ర్గాల‌కు చోటు క‌ల్పిస్తామ‌ని చెప్పారు.  అన్ని వ‌ర్గాల‌కు అంటే ఉగ్ర‌వాదులు, కిడ్నాపులు చేసిన వారు, హ‌త్య‌లు చేసిన‌వారు అని అర్ధం కాబోలు.  అందుకే ఆ ప్ర‌భుత్వంలో తాలిబ‌న్ ఫైవ్‌కు చోటు క‌ల్పించింది.  ఉగ్ర‌వాద నేర చ‌రిత క‌లిగిన అబ్దుల్ హ‌క్ వ‌సీద్‌కు ఇంటిలిజెన్స్ శాఖ‌ను అప్ప‌గించింది.  ఇక మ‌రో ఉగ్ర‌వాది నూరుల్లా నూర్‌కు ట్రైబ‌ల్ అఫైర్స్ మినిస్ట‌ర్‌గా, మ‌హ్మ‌ద్ ఫాజీకి డిప్యూటీ డిఫెన్స్ మినిస్ట‌ర్ శాఖ‌ను, అరాచ‌కాలు సృష్టించిన ఖైరుల్లా ఖైరాహ్ కు సాంస్కృతిక స‌మాచార శాఖ‌ను, మ‌హ‌మ్మ‌ద్ న‌బీ ఒమ‌ర్‌ను కొహెస్త్ ప్రావిన్స్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించారు.  ఈ ఐదుగురు దారుణ‌మైన నేర చ‌రిత్ర‌ను క‌లిగి ఉన్నారు.   ఇలాంటి వారిని ఆఫ్ఘ‌న్ మంత్రి వ‌ర్గంలో నియ‌మించ‌డం విశేషం.  

Read: రాజ‌స్థాన్‌ హైవేపై ర‌క్ష‌ణశాఖ విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్… ఎందుకంటే…

Related Articles

Latest Articles

-Advertisement-