ఆఫ్ఘన్ క్రికెట్ డైరెక్టర్ ను తొలగించిన తాలిబన్లు

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి ఏంటో అందరికి తెలుసు. అక్కడ తాలిబన్ల పాలన మొదలైన సమయం నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే తాలిబన్ల రాక్షస పాలనకు బయపడి చాలా మంది ఆ దేశ విడిచి పారిపోయారు. అయితే తాలిబన్లు ఆ దేశంలోని అన్ని విషయాలతో పాటుగా క్రికెట్ లోకి కూడా వచ్చేసారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న హమీద్ షిన్వారీని ఆ పదవి నుండి తాలిబన్లు తొలగించారు. అతని స్థానంలో నసీబుల్లా హక్కానీ నియమించారు. అయితే వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే అర్హత సాధించగా.. ఇప్పుడు ఆ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆడుతుందా.. లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు అందరూ దేశం బయటే ఉన్నారు. అలాగే ఐపీఎల్ క్రాంట్రాక్టు పొందివారు ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఆడుతున్నారు కూడా. చూడాలి మరి ప్రపంచ కప్ సమయానికి ఏం జరుగుతుంది అనేది.

-Advertisement-ఆఫ్ఘన్ క్రికెట్ డైరెక్టర్ ను తొలగించిన తాలిబన్లు

Related Articles

Latest Articles