ఎయిర్‌పోర్ట్‌లో విమానాలకు బదులు సైకిళ్లు…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను అమెరికా ద‌ళాలు పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిన త‌రువాత ఎయిర్‌పోర్ట్ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది.  రాత్రి తాలిబ‌న్ ద‌ళాలు ఎయిర్‌పోర్ట్‌లోకి ప్ర‌వేశించాయి.  ఈ త‌రువాత తాలిబ‌న్లు త‌యారు చేసిన బ‌ద్రి 313 ఫోర్స్ ద‌ళాలు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లి అనువ‌ణువును గాలించాయి.  తాలిబ‌న్ నేత‌లు కార్ల‌లో వెళ్లి ప‌రిశీలిస్తే, కొంతమంది మాత్రం ఎయిర్‌పోర్ట్‌లోకి సైకిళ్ల‌పై వెళ్లారు.  ట్రాక్‌పై రౌండ్లు వేశారు.  దీనికి సంబందించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం ఈ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఉద‌యం నుంచి తాలిబ‌న్లు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి అన్నింటినీ ప‌రిశీలిస్తున్నారు.  పూర్తిస్థాయిలో ప‌రిపాల‌న త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్న‌ట్టు తాలిబ‌న్లు చెబుతున్నారు.  

Read:

Related Articles

Latest Articles

-Advertisement-