పోర్న్‌ సైట్లు చూస్తున్న తాలిబన్లు.. ఎందుకో తెలిస్తే షాకే..!

తాలిబ‌న్లు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి.. ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌ సహా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. పంజ్‌షీర్‌ ను మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయారు.. అక్కడ తాలిబన్లు-సైన్యం మధ్య భీకర పోరు నడుస్తోంది.. దాదాపు 600 మంది తాలిబన్లు హతం అయినట్టు తెలుస్తోంది.. మరోవైపు.. తాలిబన్ల అరాచకపాలన కొనసాగుతోంది.. అంద‌రిని గౌరవిస్తాం, మ‌హిళ‌ల‌కు వారి హ‌క్కుల‌కు భంగం క‌లగ‌కుండా చూస్తాం, ఎవరిపై ప్రతీకారం ఉండదు.. అంటూ ప్రకటించి.. ఆ తర్వాత వారిపని వాళ్లు చూస్తేనే ఉన్నారు.. దాడులు, కాల్పులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు తాలిబన్లు పోర్న్‌ సైట్లపై పడ్డారు.. ఆఫ్ఘన్‌లో గత ప్రభుత్వం అమ‌లులో ఉన్న స‌మ‌యంలో అనేక మంది మ‌హిళ‌లు అశ్లీల చిత్రాల్లో న‌టిస్తూ జీవ‌నం సాగించారు.. మరికొందరు సెక్స్ వ‌ర్కర్లుగా తమ జీవితాన్ని వెల్లదీశారు.. ఇలాంటి మహిళలు, రాజధాని కాబూల్‌ సహా మరికొన్ని పట్టణాల్లో వేలాది మంది ఉన్నారు.. అయితే, ఇప్పుడు తాలిబన్ల కన్ను వారిపై పడింది.. వారిని గుర్తించి బహిరంగంగా శిక్షలు విధించి, అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

దీని కోసం ఓవైపు వేశ్యల లిస్ట్‌ను తయారు చేస్తూనే మరోవైపు.. పోర్న్‌ సైట్లను చూస్తున్నారు.. పోర్న్‌ వీడియోలు చూస్తూ.. అశ్లీల చిత్రాల్లో న‌టించిన వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు తాలిబన్లు.. విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న ఆఫ్ఘన్‌ మహిళలను గుర్తించి, వారికి మరణశిక్ష విధించే ఆలోచనలో తాలిబన్లు ఉన్నట్టు ‘ద సన్‌’ పత్రిక పేర్కొంది. ఇప్పటికే వేశ్యల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత తమ చట్టాల ప్రకారం వీరికి మరణశిక్ష విధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వేశ్యల పరిస్థితే కాదు.. ఆఫ్ఘన్‌లో మహిళల పరిస్థితి మరోసారి దారుణంగా తయారవుతోంది.. దీంతో.. ప్రాణాలు అర‌చేతిల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు ఆఫ్ఘన్‌ మహిళలు.. అయితే, వేశ్యలను, పోర్న్‌ వీడియోల్లో నటించినవారిని కూడా అందరినీ హతమార్చడం తాలిబన్లకు ఇష్టం లేదట.. ఎందుకంటే.. అందులో తమకు నచ్చినవారిని మాత్రం సెక్స్‌ బానిసలుగా మార్చి.. తమ అరచకాన్ని కొనసాగించే ఆలోచనలో ఉన్నారని ఆ కథనం సారాశం.

Related Articles

Latest Articles

-Advertisement-