ఆఫ్ఘన్ లో ఐపీఎల్ 2021 బ్యాన్…

గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వం కూడా వారికి అధికారాన్ని అప్పగించేసింది. దాంతో అక్కడ తాలిబన్ల రాక్షస పాలన మొదలైంది. అయితే తాజాగా ఆఫ్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం ఐపీఎల్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మొదట వాయిదా పడిన ఐపీఎల్ ఇప్పుడు యూఏఈ వేదికగా జరుగుతుంది. కానీ తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో ఐపీఎల్ 2021 ప్రత్యక్ష ప్రసారని బ్యాన్ చేసారు తాలిబన్లు. ప్రేక్షకులలో మహిళలు ఉండటం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ కు సంబంధించిన ఎటువంటి ప్రత్యక్ష ప్రసారం ఉండకూడదని ఆఫ్ఘన్ మీడియాకు ఆదేశాలు జారీ చేసారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అక్కడ చీర్ గర్ల్స్ డ్యాన్స్ చేయడం మరియు మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానుల్లో మహిళలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబన్ల పాలనలో ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే.

-Advertisement-ఆఫ్ఘన్ లో ఐపీఎల్ 2021 బ్యాన్...

Related Articles

Latest Articles