ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ పట్టం కట్టడంలో తెలుగువారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించేవారిని సైతం పట్టుకు వచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూంటారు మనవాళ్ళు. నటి నిత్య మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళం�
తాత ఏయన్నార్ మహానటుడు. తండ్రి నాగార్జున టాప్ స్టార్. అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు. ఏడాది దాటిన వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగ�
వైవిధ్యానికి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అంటారు అభిమానులు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నది అనేకుల మాట. రామ్ గోపాల్ వర్మ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన లేవనెత్తే వివాదాలే! ఒకటా రెండా ఏదో విధంగా వార్తల్లో నిలవడమే వర్మకు మహా ఇష్టం. ఎవరో ఒకరిని అడ్డంగా విమర్శించి వివాదానికి తెరలేపుతారాయన.
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి పట్టం కట్టడంలో ముందుంటారు తెలుగువారు. పరభాషా నటులకు సైతం పట్టం కట్టి ఆదరించారు. కన్నడనాట జన్మించి తెలుగునాట రాణించిన వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో వినోద్ కుమార్ కూడా చోటు సంపాదించారు. తెలుగునాట హీరోగా తనదైన బాణీ పలికించిన వినోద్ కుమార్ ప్రస్తుతం కేరెక్టర్ యాక
నవతరం కథానాయకుల్లో వచ్చీ రాగానే సందడి చేసిన హీరో విశ్వక్ సేన్ అనే చెప్పాలి. రెండు సినిమాల్లో నటించాడో లేదో, మూడో చిత్రానికే మెగాఫోన్ పట్టేసి డైరెక్టర్ అయిపోయాడు విశ్వక్ సేన్. తన సినిమాల టైటిల్స్ విషయంలోనూ వైవిధ్యం చూపిస్తూ సాగుతున్నాడు విశ్వక్. విశ్వక్ సేన్ అసలు పేరు దినేశ్ నాయుడు. 1995 మార్చి 29న జ�
విశాల నేత్రాలు, చక్కటి వర్చస్సు, చూడగానే చూపరులను ఆకట్టుకొనే రూపం, అందుకు తగ్గ అభినయం, ఆ రూపానికి తగిన లావణ్యం, దానిని ప్రదర్శిస్తూ సాగే నాట్యం అభినేత్రి శోభనను అందరి మదిలో చోటు సంపాదించుకొనేలా చేశాయి. మళయాళ సీమలో పుట్టినా, తెలుగు చిత్రసీమలో రాణించిన వారెందరో ఉన్నారు. వారిలో నటి, నర్తకి శోభన స్థాన
‘మనిషికి పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ’ అన్నారు పెద్దలు. అన్న పెద్దవారు పురుషాధిక్య ప్రపంచంలోని జీవులు కాబట్టి, ఆ మాటను మగాడికే అన్వయిస్తూ అలా నుడివారు. కానీ, పట్టుదల ఉన్న మహిళలు కూడా అనుకున్న రంగంలో అలరించగలరని, అందునా గ్లామర్ వరల్డ్ లోనూ మెగా ఫోన్ పట్టి మగాళ్ళకు దీటుగా రాణించగలరని కొందరు �
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందుతున్న సినిమా గ్లిమ్స్‌ను అతని బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఒరిజినల్స్ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెం 10గా నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్
తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, మళయాళ సీమలో తన స్వరవిన్యాసాలతో ఆకట్టుకున్న ఘనుడు మన విద్యాసాగర్. మాతృభాషలో కన్నా మిన్నగా పరభాషల్లోనే పదనిసలు పలికించి, పులకింప చేశారాయన. విద్యాసాగర్ పరభాషల్లో పలికించిన స్వరాలను మన తెలుగువారు కాపీ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కళలకాణాచిగా పేరొందిన విజయనగరంలో
చూడగానే ముద్దుగా బొద్దుగా ఉంటూ మురిపించి, మైమరిపించారు రజనీ అందం. ఆమె ముద్దుమోముకు తగ్గ నవ్వులు నాట్యం చేసేవి. చిత్రసీమలో ‘నవ్వుల రజనీ’గానే పిలిచేవారు. 1985 ప్రాంతంలో తెలుగువారి ముందు నిలచిన రజనీ అందం, చందం నాటి రసికులకు బంధం వేశాయి. వచ్చీ రాగానే రజనీ బాగా పరిచయమున్న అమ్మాయిలా ఆకట్టుకున్నారు. ఇక