సుకుమార్ భార్యకు ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “పుష్ప” చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్రోల్ చేస్తున్నారు. కాగా తాజాగా సుకుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ భార్య తబిత ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలు చేపట్టింది. సుకుమార్ సహచరుడు, ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలను నిర్వహించే ప్రసాద్ అనే వ్యక్తి మార్చి 28న గుండెపోటు కారణంగా కన్నుమూశారు. దీంతో ఇప్పుడు ఆ బాధ్యతలను సుకుమార్ తన భార్యకు అప్పగించారు. ఇప్పటి నుంచి సుకుమార్ గైడెన్స్ లో ఆమె ఈ బ్యానర్ ను నడిపించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ 2014 లో స్థాపించబడింది. తన బ్యానర్‌లో కుమారి 21 ఎఫ్ (2015) చిత్రంతో సుకుమార్ చిత్ర నిర్మాతగా మారారు. అతను దర్శకుడు, 100% కాదల్, ఉప్పెన వంటి చిత్రాలకు మద్దతు ఇచ్చాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో నిఖిల్ హీరోగా నటించిన “18 పేజెస్” ను నిర్మిస్తున్నారు సుకుమార్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-