“మిషన్ ఇంపాజిబుల్”లో తాప్సి పాత్ర రివీల్

బాలీవుడ్ నటి తాప్సీ దాదాపు 3 సంవత్సరాల తర్వాత తన టాలీవుడ్ రీఎంట్రీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె ఇటీవల తన తెలుగు చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ బ్యూటీ “హసీన్ దిల్ రూబా” చిత్రంతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయి. కాగా కొన్ని రోజుల క్రితం “మిషన్ ఇంపాజిబుల్” అంటూ తన తెలుగు చిత్రం టైటిల్ అనౌన్స్ చేసి అందరిలో ఆసక్తిని పెంచేసింది. ఈ చిత్రానికి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహిస్తున్నారు. “మిషన్ ఇంపాజిబుల్‌”ను మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిర్ంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Read Also : “ఆర్ఆర్ఆర్” టీంలో చేరిన అలియా

ఇది బౌంటీ హంటర్స్ కథ ఆధారంగా తిరుపతిలో సెట్ చేయబడిన కథ. తాజా సమాచారం ప్రకారం తాప్సి తిరుపతి కేంద్రంగా పని చేస్తున్న స్వతంత్ర జర్నలిస్టుగా కనిపిస్తుంది. ఆమె పాత్ర చుట్టూ చాలా ఆసక్తి నెలకొంటుంది. ఆమె నటన “మిషన్ ఇంపాజిబుల్” చిత్రానికి ప్రధాన హైలెట్ గా నిలవనుంది అంటున్నారు. స్వరూప్ ఇందులో డిటెక్టివ్ పాత్రలో పోషిస్తుండడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-