అత్యాచార ఆరోపణలు.. అవాస్తవాలు: టీ సిరీస్‌

ప్రముఖ నిర్మాత, టీ సిరీస్ సంస్థ ఎండీ భూషణ్ కుమార్‌పై రేప్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమా చాన్సులు ఇప్పిస్తానని నమ్మించి తనను మోసం చేశాడంటూ 30 ఏళ్ల ఓ యువతి భూషణ్‌ మీద కేసు పెట్టింది. మూవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మూడేళ్లపాటు భూషణ్ కుమార్ తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని కంప్లయింట్ చేసింది. అయితే, బాధితురాలి ఆరోపణలను టీ సిరీస్‌ తోసిపుచ్చింది. ఆమె చెప్పేవన్నీ అవాస్తవాలేనని పేర్కొంది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు. ఈ మేరకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఆమెలో టీ సిరీస్‌ బ్యానర్‌ లో పనిచేసిందని.. ఈ క్రమంలో దోపిడీకి ప్రయత్నించగా జూలై 1న అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశామన్నారు. దొంగతనానికి ప్రయత్నించింది అని నిరూపించేందుకు మా దగ్గర ఆడియో క్లిప్పింగ్స్‌ కూడా ఉన్నాయన్నారు. వీటిని అధికారులకు అప్పగిస్తామన్నారు. ఆ దోపిడీ కేసుకు కౌంటర్‌గా ఆమె ఈ ఫిర్యాదు చేసిందే తప్ప అంతకు మంచి మరొకటి కాదని చెప్పుకొచ్చారు. మరి ఈ కేసు ఎటూ మలుపు తిరుగుతోందో అనేది చూడాలి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-