సీఎం జగన్‌ను కలిసిన స్వాత్మానందేంద్ర సరస్వతి

విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం మధ్యాహ్నం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్‌ను స్వాత్మానందేంద్ర సరస్వతి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందజేసి శాలువా కప్పి వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో స్వాత్మానందేంద్రతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు.

Related Articles

Latest Articles