స్టార్ హీరోయిన్ కి కరోనా.. త్వరగా చచ్చిపో అంటూ నెటిజన్స్ ఆగ్రహం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉంటె ఆమె అక్కడ ఉంటుంది.. ఆమె ఎక్కడ ఉన్నా వివాదాలను మాత్రం వదలదు. గతంలో ఆమె మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో తెలిసిందే. నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటె అమ్మడు తాజాగా కరోనా బారిన పడింది. ఈ విషాయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాం. ఇటీవల నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరు మాస్క్ ధరించండి.. జాగ్రత్తగా ఉండండి” అని చెప్పుకొచ్చింది.

ఇక ఈ ట్వీట్ పై ట్రోలర్స్ తమదైన రీతిలో విరుచుకుపడ్డారు. ఇతర ప్రముఖులకు కరోనా వస్తే సపోర్ట్ నిలిచే నెటిజన్లు.. స్వరాలను మాత్రం త్వరగా చచ్చిపో అని అనడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ” స్వరా .. నీకు కరోనా రావడానికి కారణం మోదీ అని నిందలు వేసి.. కొత్త వివాదానికి తెరలేపు అని కొందరు. 2022 లో నేను విన్న అతి మంచి విషయాల్లో ఇది ఒకటి. త్వరగా చనిపోయి నరకానికి వెళ్లు .. ఓ అక్కడ కూడా నీకు స్థానం లేదు.. ఇక్కడే రెస్ట్ తీసుకో అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ కామెంట్స్ పై స్వరా స్పందిస్తూ” నేను చనిపోతే మీరందరు ఎలా బ్రతుకుతారు.. మీ బ్రతుకుతెరువు నన్ను ట్రోల్ చేయడమే కదా.. మీ కుటుంబాన్ని మీరు ఎలా పోషిస్తారు.. మీ భావోద్వేగాలను దుపులో పెట్టుకోండి” అంటూ స్ట్రాంగ్ సెటైర్ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles