తన జన్మదిన వేడుకల్లో ప్రసంగిస్తూ ప్రాణాలు విడిచిన స్వామీజీ..

ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తారో చెప్పలేని విషయమే.. కొందరు విధి నిర్వహణలో ఉండగానే ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఆడుతూపాడుతూ కన్నుమూసినవారు కూడా లేకపోలేదు.. అయితే, ఓ స్వామీజీ తన పుట్టినరోజు నాడే కన్నుమూశారు.. అది కూడా తన జన్మదిన వేడుకల్లోనే ప్రాణాలు విడిచారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో బలోబలం మఠం ఉంది.. ఆ పీఠాధిపతి అయిన సంగనబసవ మహాస్వామీజీ.. ఇటీవల జరిగిన తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు..

Read Also: టిప్పు సుల్తాన్‌ సింహాసనం వేలం.. మండిపడుతోన్న భారత్..!

అయితే, ప్రసంగిస్తున్న సమయంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో.. అలాగే కుప్పకూలిపోయారు.. తన కూర్చున్న కుర్చీలోనే తల వెనక్కి వాల్చి అక్కడికక్కడే కన్నుమూశారు. పక్కనే ఉన్న స్వామీజీ, భక్తులు వెంటనే అప్రమత్తమైనప్పటికీ.. ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు.. అయితే, స్వామీజీ జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులు ఆయన ప్రసంగాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి.. ఇప్పుడు సోషల్‌ మీడియాకు ఎక్కాయి.

Related Articles

Latest Articles