కరోనా టెస్టులో అపశృతి : పుల్ల ముక్కులోనే విరిగిపోయిన వైనం

చైనాలో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనాను అరికట్టేందుకు అన్నీ రాష్ట్రాలు పరీక్షల సంఖ్యను పెంచాయి. దీంతో లక్షణాలు ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా టెస్టులో అపశృతి చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావుపల్లిలో కరోనా పరీక్ష నిర్వహించే సమయంలో పుల్ల ముక్కులోనే విరిగిపోయింది. రామడుగు మండలంలోని ఓ గ్రామ సర్పంచి శేఖర్ కొవిడ్ పరీక్ష చేయించు కునేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడ కరోనా పరీక్ష చేస్తుండగా టెస్టు చేసేందుకు వినియోగించే ప్లాస్టిక్ పుల్ల ముక్కులో విరిగిపోయింది. దీంతో ఆ బాధితుడిని కరీంనగర్ తరలించారు. పరిస్థితి అర్థం చేసుకున్న వైద్యులు.. ఎండోస్కోపీ విధానం ద్వారా పుల్లను బయటకు తీశారు. దీంతో సదరు వ్యక్తి ప్రమాదం నుంచి బయట పడ్డాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-