టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే.. హైకోర్టుకు సువేందు

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత కూడా పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతూనే ఉంది.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కొందరు నేతలు.. టీఎంసీ విజయం సాధించి.. మరోసారి మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత తిరిగి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. అందులో ఒకరు ఎమ్మెల్యే ముఖుల్ రాయ్.. అయితే.. బీజేపీ టికెట్‌పై గెలిచి టీఎంసీలో చేరిన ఎమ్మెల్యే ముఖుల్ రాయ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి.. టీఎంసీలో చేరిన ముఖుల్ సభ్యత్వం.. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. చెల్లదని, అయినప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖుల్‌ రాయ్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లవచ్చునని సూచించారు.. కాగా, టీఎంసీలో చేరిన ముఖుల్‌.. ప్రస్తుతం అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు..

-Advertisement-టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే.. హైకోర్టుకు సువేందు

Related Articles

Latest Articles