తేజ్ యాక్సిడెంట్ పై అనుమానాలు… విచారణ ప్రారంభం

సాయి ధరమ్ తేజ రోడ్డు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదం పై పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనే దానిపై విచారణ ప్రారంభించారు. తేజ్ ఇంటి దగ్గర్నుంచి నరేష్ ఇంటికి వెళ్ళిన దానిపై ఆరా తీస్తున్నారు. నరేష్ ఇంటి దగ్గర్నుంచి అతని కొడుకుతో కలిసి తేజ్ బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. బైక్ రేసింగ్ పాల్పడ్డారన్న అనుమానాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నరేష్ కుమారుడు, తేజ్ ఇద్దరూ కలిసి ఎటు వెళ్తున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు.

రేసింగ్ లో భాగంగా ?
తేజ్ కోలుకున్న తర్వాత ఆయనను కూడా విచారించారు. ఆయనను విచారిస్తే కానీ అసలు విషయం బయటికి రాదు. కానీ అందరూ అనుకుంటున్నట్టుగా బైక్ రేసింగ్ లకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే తేజ్ పై ర్యాష్ డ్రైవింగ్, ఫాస్ట్ గా డ్రైవ్ చేయడంపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తేజ, నవీన్, మరో వ్యక్తి కలిసి ఒకే చోట నుంచి బయలుదేరినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక డిస్టనేషన్ పెట్టుకుని ఎవరు ముందు వెళ్తారు? అనేదానిపై రైడింగ్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. రైడింగ్, రేసింగ్ కోణంలోనూ పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.

చాలాసార్లు హెచ్చరించాను : నరేష్
నరేష్ మాట్లాడుతూ బైక్‌ రైడింగ్‌పై సాయి ధరమ్‌ తేజ్‌ని హెచ్చరించానని, చాలా సార్లు రైడింగ్‌ వద్దని చెప్పానని అన్నారు. సాయి ధరమ్ తేజ్‌ యాక్సిడెంట్ కు ముందు తన ఇంటి నుంచే బయల్దేరాడని తెలిపారు. అలాగే తేజ్‌, తన కుమారుడు ఇద్దరు కలిసి రైడింగ్‌ చేస్తారని ఆయన స్వయంగా వెల్లడించారు. రైడింగ్‌పై ఇది వరకే ఇద్దరినీ హెచ్చరించానని, తేజ్ కు యాక్సిడెంట్ జరగడం ప్రమాదకరం అని నరేష్ అన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-