తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై సస్పెన్స్

తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి వారంలో రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని గతంలో చెప్పిన సర్కార్.. లాక్ డౌన్ ముగియగానే ఇంటర్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పుడు అంటోంది. ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి పరీక్షలు, ఫలితాలపై ఏ నిర్ణయం తీసుకున్నారో వివరాలు తెప్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జులై రెండో వారంలో పరీక్ష సమయం తగ్గించి పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రానికి చెప్పిన తెలంగాణ… ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. 12వ తరగతి పరీక్షలపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్రం… పరీక్షలు రద్దు చేసి ఫలితాలు ఏ ప్రాతిపదికన ప్రకటించాలి అనే దానిపై కమిటీ వేసింది cbse. అటు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చామని అంటున్నారు ఇంటర్ అధికారులు. పరీక్షలు నిర్వహించలేని పక్షంలో ఫలితాలు ఎలా ప్రకటించాలి అనే దానిపై ప్రభుత్వం కి ప్రతిపాదనలు పంపించామంటున్నారు ఇంటర్ అధికారులు. మొదటి సంవత్సరంలో వచ్చిన మార్క్స్ ఆధారంగా రిజల్ట్స్ ప్రకటించడంతో పాటు పలు ప్రత్యామ్నాయాలు ప్రభుత్వానికి సూచించామని అంటున్నారు అధికారులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-