ఢిల్లీకి ఆక్సిజన్ సిలిండర్లు… నెటిజన్‌ విమర్శలపై సుష్మితా సేన్ ఫైర్…!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా భారతదేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే కరోనా పై అవగాహన కల్పించడానికి, పేదలకు ఆర్ధిక సహాయం అందించడానికి కొంతమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల ఢిల్లీలోని కొన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపడానికి సుష్మితా సేన్ ముందుకొచ్చారు. ఆసుపత్రుల్లో చాలామంది పేషంట్స్ ప్రాణాలు రిస్క్ లో ఉండడం బాధాకరంగా ఉందని తెలుపుతూ, ఢిల్లీ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను ఎలా రవాణా చేయాలి అంటూ సుష్మిత ట్విట్టర్ లో నెటిజన్లను సలహా కోరింది. అయితే ఈ సందర్భంగా ఓ నెటిజన్ ముంబై ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి బదులు ఢిల్లీకి పంపిస్తోంది అంటూ సుష్మితను విమర్శించాడు. దీంతో సుష్మిత ఆ నెటిజన్ పై మండిపడింది. ముంబైలో ఇంకా ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, కానీ ఢిల్లీకి ఇది అవసరం, ముఖ్యంగా చిన్న ఆసుపత్రులకు… ఒకవేళ మీరేదన్నా సహాయం చేయగలిగితే చేయండి అంటూ ఫైర్ అయ్యింది సుష్మిత. తరువాత ఆక్సిజన్ సిలిండర్లను సురక్షితంగా వేరే చోట నుండి ఆసుపత్రికి పంపిణీ చేసినట్లు ఆమె తన అభిమానులతో పంచుకున్నారు.

Related Articles

Latest Articles