‘రావణాసుర’లో అక్కినేని హీరో..

మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ అందించారు.  ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నాడు. దీపా‌వళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాలో రవితేజ పది గెటప్పులో కనిపించనున్నాడట.

ఇకపోతే ఈ చిత్రంలో మరో యంగ్ హీరో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. అతనే అక్కినేని హీరో సుశాంత్. తాజాగా సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ అనే పాత్రలో సుశాంత్ కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక అక్కినేని హీరో లుక్ చూస్తుంటే కొద్దిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఫస్ట్ లుక్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ లుక్ నే సుశాంత్ కి పోస్టర్ కి కూడా వాడారు. ఇక సుశాంత్ పొడవైన జుట్టుతో ఇంటెన్సివ్ లుక్ లో కనిపించాడు. ఏదిఏమైనా సుశాంత్ ఎంట్రీతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జ‌న‌వ‌రి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది.

Related Articles

Latest Articles