పోలీసుల అదుపులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని

బాలీవుడ్ యంగ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆయన మరణం తరువాత అనూహ్యంగా మాదకద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితానిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) శుక్రవారం అదుపులోకి తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదకద్రవ్యాల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌సిబి అధికారులు హైదరాబాద్‌కు చెందిన సిద్దార్థ్ పితానిని 28, 29, 27 ఎ సెక్షన్ల కింద కుట్రపన్నారనే ఆరోపణలతో అరెస్టు చేసి ముంబైకి తరలించారు. మాదకద్రవ్యాల కేసులో సిద్దార్థ్ పితాని పాత్ర ఉన్నట్టు ఇటీవల ఎన్‌సిబి దర్యాప్తులో బయటపడింది. అందుకే అతన్ని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. కాగా ముంబైలోని తన బాంద్రా ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి సిద్ధార్థ్ నివసించేవాడు. జూన్ 14న సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణానికి ముందురోజు రాత్రి… అంటే తెల్లవారుజామున 1 గంటలకు సుశాంత్‌ను కలిశాను అని సిద్ధార్థ్ పోలిసుల విచారణలో వెల్లడించారు. గత ఏడాది ఆగష్టులో సిబిఐ సిద్ధార్థ్ తో పాటు కుక్ నీరజ్, దినేష్ సావంత్ ను ఇన్వెస్టిగేట్ చేసింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-