సుశాంత్​ వ్యక్తిగత సిబ్బందికి సమన్లు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో దర్యాప్తును ఎన్​సీబీ ముమ్మరం చేసింది. గత కొద్దికాలంగా నత్త నడక నడుస్తున్న సుశాంత్ సింగ్ మరణం కేసు ఒక్కసారిగా ఊపందుకొన్నది. ఈ కేసులో కీలకంగా మారిన సిద్ధార్థ్ పితానిని ఈడీ, సీబీఐ, ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో అకస్మాత్తుగా సిద్దార్థ్​ను అరెస్ట్ చేయడం పట్ల మరోసారి బాలీవుడ్​లో కలకలం రేగుతోంది. సిద్ధార్థ్​ అరెస్టు తర్వాత సుశాంత్​ ఇంట్లో సహాయకులుగా పనిచేసిన నీరజ్​, కేశవ్​ను డ్రగ్స్​ కేసులో భాగంగా ప్రశ్నించనున్నట్లు నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో తెలిపింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-