సూర్య ‘జై భీమ్’ తమిళ, తెలుగు భాషల్లో ఎప్పుడంటే…

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ గత యేడాది కరోనా టైమ్ లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. అదే సినిమాను ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ చేసి ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సూర్య పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘జై భీమ్’. ఇది సూర్య నటిస్తున్న 39వ చిత్రం. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్య, తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. పేదల తరఫున పోరాడే లాయర్ పాత్రను ఇందులో సూర్య పోషిస్తుండటం విశేషం. రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, మణికందన్, జయప్రకాశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను దీపావళి కానుకగా, నవంబర్ 2న తమిళ, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి ‘ఆకాశం నీహద్దురా’ తరహాలో సాగే ఈ ఆలోచనాత్మక చిత్రం అదే స్థాయి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

-Advertisement-సూర్య 'జై భీమ్' తమిళ, తెలుగు భాషల్లో ఎప్పుడంటే…

Related Articles

Latest Articles