సూర్య మంచి మనసు… అభిమానుల కోసం ఏకంగా ఆ పని…!

కోవిడ్ -19 మహమ్మారి, లాక్డౌన్ పరిస్థితుల వల్ల దేశంలో చాలా మందిపై ఎఫెక్ట్ పడింది. సెకండ్ వేవ్ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశంలో కర్ఫ్యూ విధించడం తప్పనిసరి అవుతోంది ప్రభుత్వానికి. ఈ క్లిష్ట పరిస్థితుల కారణంగా పనిని కోల్పోయిన తన ఫ్యాన్ క్లబ్ సభ్యులకు సహాయం చేయడానికి కోలీవుడ్ స్టార్ సూర్య ముందుకు వచ్చారు. ఈ స్టార్ హీరో తన అభిమాన సంఘాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై ఆలస్యం చేయకుండా స్పందిస్తారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల వల్ల పని కోల్పోయిన 250 మంది ఫ్యాన్ క్లబ్ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5000 విరాళంగా ఇచ్చారట సూర్య. సూర్య తన అభిమానుల పట్ల చూపుతున్న ఆదరాభిమానాలకు, ఆయన మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఇటీవల సూర్య తన తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీలతో కలిసి మేలో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-