కొరటాల బర్త్ డే… చిరు, ఎన్టీఆర్ అభిమానులకు ట్రీట్…?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ పుట్టినరోజు నేడు. ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్న ఆయన రచయితగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి తదితర చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేశారు. ప్రభాస్ తో “మిర్చి” తీసి డైరెక్టర్ గా టర్న్ తీసుకున్నాడు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో మహేష్ బాబు సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. “శ్రీమంతుడు”తో సోషల్ మెసేజ్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తీసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో “జనతా గ్యారేజ్”, మరోసారి మహేష్ తో “భరత్ అనే నేను” సినిమాలతో మ్యాజిక్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో “ఆచార్య”, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో చిత్రాన్ని చేస్తున్నాడు. నేడు కొరటాల పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని మెగా, నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెగా అభిమానుల కోసం “ఆచార్య” అప్డేట్, అలాగే నందమూరి అభిమానుల కోసం ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయాన్ని ప్రకటించడానికి కొరటాల సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ భారీ మూవీ లో కియారా అద్వాని హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఈరోజు వచ్చే ఆ రెండు అప్డేట్స్ ఏంటో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-