అమితాబ్ ను ఏడిపించిన సూర్య

సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు అటు విమర్శకుల ప్రశంసలతో పాటు ఇటు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించింది. ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ బయోపిక్ గా సుధకొంగర తెరకెక్కించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చూశారు. అమితాబ్ బచ్చన్ తన పర్సనల్ బ్లాగ్ లో ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌తో సినిమాలోని పాట ‘కయిలే ఆకాశం’ను ప్రస్తావించారు. సూర్య నటించిన ఈ పాట నాకు కంటతడి పెట్టకుండా చేసింది, ఇది తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగ అనుభూతిని కలిగించింది అని బిగ్ బి పర్సనల్ బ్లాగ్ లో పోస్ట్ చేసారు. గీత రచయిత యుగభారతి రాసిన ఈ పాటను జీవీ ప్రకాశ్ భార్య సైంధవి పాడారు. అమితాబ్ స్పందనకు సూర్యకు చెందిన 2డి ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ స్పందిస్తూ మీరు చాలా దయ కలవారు సీనియర్ బచ్చన్ సర్ అని కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది.

Related Articles

Latest Articles

-Advertisement-