‘వాడి వాసల్’ కోసం బుల్ ఫైట్ నేర్చిన సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పాత్ర కోసం ప్రాణం పెట్టే మనిషి. కెరీర్ ప్రారంభం నుండి అతను చేసిన సినిమాలను గమనిస్తే ఆ విషయం అర్థమౌతుంది. తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించడం కోసం సూర్య ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. మేకప్ పరంగానూ, టెక్నాలజీ సాయంతోనూ వెండితెర మీద భిన్నంగా కనిపించడమే కాదు… స్వయంగా కష్టపడి కూడా తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి సూర్య తపిస్తుంటాడు. త్వరలోనే సూర్య నటించిన వెబ్ సీరిస్ ‘నవరస’ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనితో పాటు పాండిరాజ్ మూవీలోనూ సూర్య నటిస్తున్నాడు. దీని షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ విషయాన్ని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న రత్నవేలు అధికారికంగా తెలిపాడు.

ఇదిలా ఉంటే సూర్య ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ మూవీ ‘వాడి వాసల్’లో నటిస్తున్నాడు. జల్లికట్టు నేపథ్యంలో ఇది తెరకెక్కబోతోంది. ఇప్పటికే కమల్ హాసన్ తో పాటు పలువురు తమిళ హీరోలు జల్లికట్టుపై కొన్ని సినిమాలు చేసినా, వాటికి భిన్నంగా సూర్య మూవీ వుండబోతోందట. ఎద్దులతో పోరాడే సన్నివేశాలు సహజంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సూర్య అందుకు తగిన శిక్షణ తీసుకున్నాడట. దర్శకుడు వెట్రిమారన్ కోరిక మేరకు సుశిక్షితుడైన సూర్య అతి త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది. దీన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. అదే విధంగా పాండిరాజ్ సినిమాలోనూ సూర్య ఓ మాస్ క్యారెక్టర్ చేయబోతున్నాడని, టైటిల్ సైతం పరమ మాస్ గా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే సూర్య తాను తమిళంలో చేసిన ‘సూరారై పొట్రు’ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. మొత్తం మీద ఇటు నటుడిగా, నిర్మాతగానూ సూర్య పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-