అమెజాన్ కు “జై భీమ్” సెగ… ముదురుతున్న వివాదం

ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం విడుదలైనప్పటి నుండి వివాదంలో ఉంది. ఈ సినిమా ద్వారా వన్నియార్ సంఘం పరువు తీసే ప్రయత్నం చేశారని, సదరు వర్గాన్ని కించపరిచారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోంది తప్ప ఇంకా చల్లారడం లేదు. తాజాగా #SuriyaHatesVanniyars అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దీని ద్వారా వన్నియార్ వర్గం ప్రజలు సూర్యపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం సెగ ఇక్కడితో ఆగలేదు సినిమా ను విడుదల చేసిన దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ను కూడా తాకింది. #amazonstophate అంతో అమెజాన్ పై కూడా మండిపడుతున్నారు. వన్నియార్ వర్గీయుల నుంచి బెదిరింపులు ఎదురవడంతో చెన్నైలోని సూర్య ఇంటి వద్ద ముందు జాగ్రత్తగా భద్రతను పెంచారు. మరోవైపు సూర్యను సపోర్ట్ చేస్తూ ఆయన అభిమానులు, సినిమా సెలెబ్రిటీలు సైతం ట్వీట్స్ చేస్తున్నారు.

Read Also : ‘రాధే శ్యామ్’ స్టోరీ ఇదే… లీక్ చేసిన లిరిసిస్ట్

అసలు వివాదం ఏమిటంటే?
సూర్య నటించిన ‘జై భీమ్’ నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. నటుడు తమిజ్ ఈ చిత్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్ గురుమూర్తి పాత్రను పోషించారు. సినిమాలోని ఒక సన్నివేశంలో గోడపై క్యాలెండర్ లో మతతత్వ చిహ్నం ఉండగా గురుమూర్తి తాగుతున్నాడు. దీనిపై వన్నియార్ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆ చిహ్నాన్ని లక్ష్మీదేవితో చిత్రబృందం రీప్లేస్ చేసినప్పటికీ వివాదం ఏమాత్రం సద్దుమణగలేదు. సూర్యపై పలు చోట్ల కేసులు కూడా నమోదు చేశారు. ఇలాంటి చర్యలు సివిల్, క్రిమినల్ రెండూ క్రిమినల్ కేటగిరీ కిందకు వస్తుందని సంఘం చెబుతోంది. వన్నియార్, వన్నియా కుల క్షత్రియ ఇద్దరూ తమిళనాడులో చాలా వెనుకబడిన వర్గాలు. ఉత్తరాది రాష్ట్రాల్లో వీరి సంఖ్య ఎక్కువ. మరోవైపు “జై భీమ్”పై ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని ఆశిస్తున్నారు.

Related Articles

Latest Articles