బాలతో నాలుగోసారి సూర్య

తమిళనాట దర్శకుడు బాలాకి మంచి క్రేజ్ ఉంది. వివాదాస్పద అంశాలతో హార్డ్ హిట్టింగ్ సినిమాలను చేస్తుంటాడు బాల. అందుకే స్టార్స్ కూడా తన సినిమాలో నటించటానికి ఆసక్తి చూపిస్తుంటారు. బాల చివరగా జ్యోతిక నటించిన 2018 థ్రిల్లర్ డ్రామా ‘నాచియార్’ ను తెరకెక్కించాడు. ఆ తర్వాత విక్రమ్ కుమారుడు తో చేసిన ‘వర్మ’ సినిమా నచ్చలేదని వేరే దర్శకుడుతో రీ-షూట్ చేసి విడుదల చేశారు. ప్రస్తుతం బాల మలయాళ ‘జోసెఫ్‌’ ఆధారంగా ‘విశిథిరన్’ అనే సినిమాను పద్మకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అలాగే ఓ సామాజిక సమస్యతో తయారు చేసిన కథాంశంతో సినిమాను తెరకెక్కించబోతున్నాడు బాల. ఈ సినిమాను సూర్య నిర్మించనుండటం విశేషం.

గతంలో బాల దర్శకత్వంలో ‘నందా, పితామగన్’ సినిమాలలో నటించాడు సూర్య. ఇక సూర్య, జ్యోతిక నటించిన ‘మాయావి’ సినిమాను బాల నిర్మించాడు. సో మొత్తం మీద సూర్యతో నాలుగోసారి కలసి పనిచేయబోతున్నాడటన్నమాట.ఈ సినిమాలో ‘గద్దలకొండ గణేశ్’ ఫేమ్ అధర్వ హీరోగా నటిస్తాడని టాక్. అంతే కాదు సూర్య కూడా అతిథి పాత్రలో మెరుస్తాడట.

Related Articles

Latest Articles

-Advertisement-