ఇక్కడ తప్పొప్పులు ఉండవంటున్న సురేశ్ బాబు!

‘అక్టోబర్ నెలాఖరు వరకూ ఏ నిర్మాత తమ చిత్రాలను ఓటీటీలకు ఇవ్వకూడదం’టూ ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్ ఇటీవల తీర్మానం చేసింది. అయితే… దానికంటే ముందే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన బ్యానర్ లో ఇతరులతో కలిసి నిర్మిస్తున్న ‘నారప్ప, దృశ్యం -2, విరాట పర్వం’ చిత్రాలను ఓటీటీ రిలీజ్ కు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ఛాంబర్ సర్వ సభ్య సమావేశంలోనూ సభ్యులు సురేశ్ బాబును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. పెద్ద నిర్మాత అయి ఉండి, ఆయన ఓటీటీకి వెళ్ళడం ఏమిటని విమర్శించారు. అయితే దీనిపై సురేశ్ బాబు డైరెక్ట్ గా స్పందించకపోయినా, తన మనసులోని మాటను బయటపెట్టారు.

Read Also: దొంగ ఓట్ల నమోదు మొదలెట్టారు.. ఈటల సంచలన ఆరోపణలు

”సినిమా బిజినెస్ లో ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేం. కరోనా కారణంగా ఎగ్జిబిటర్స్ ఎంతో నష్టపోయారు. అదే సమయంలో నిర్మాతలూ దెబ్బతిన్నారు. కాబట్టి సినిమాల విడుదల విషయంలో ఎవరి నిర్ణయం వారు స్వతంత్రంగా తీసుకోవాలి” అని సురేశ్‌ బాబు అన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించినా ఎగ్జిబిటర్స్ తమ డిమాండ్లను ప్రభుత్వాలు పరిశీలించే వరకూ తెరిచేది లేదని అంటున్నారు. అయితే… ఈ నెలాఖరుకు థియేటర్లు ఓపెన్ కావచ్చునని కొందరు చెబుతున్నారు. అందుకే మీడియం బడ్జెట్ చిత్రాల నిర్మాతలు నెలాఖరులో తమ చిత్రాలను విడుదల చేస్తామని చెబుతున్నారట. ఇదిలా ఉంటే… సురేశ్ బాబు తమ చిత్రాల డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడో చెప్పకుండానే, ‘తమ సినిమాను ఎక్కడ విడుదల చేయాలన్నది చిత్ర నిర్మాణ భాగస్వాముల ఇష్టమని, ఈ విషయంలో ఎవరినీ ఒత్తిడి చేయకూడద’ని హితవు పలికారు. మరి ఆయన మాటలను ఎగ్జిబిటర్స్ ఆలకిస్తారో లేదో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-