’నారప్ప’ ఓటీటీ రిలీజ్ పై ఎమోషనల్ అయిన సురేష్ బాబు!

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’.. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. కాగా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత సురేష్ బాబు నారప్ప విశేషాలు చెప్పుకొచ్చారు. అయితే నారప్ప ఓటీటీ రిలీజ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపైనా ఆయన కాస్త ఎమోషనల్ అవుతూ క్షమాపణలు కోరాడు. సురేశ్​ ప్రొడక్షన్స్​లో తీసే చిత్రాలు తన నిర్ణయం మేరకు విడదులవుతాయని సురేశ్​బాబు తెలిపారు. కానీ నారప్ప నిర్మాణంలో తాము భాగస్వాములం మాత్రమేనని, నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్ణయం మేరకే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సురేశ్​బాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం థియేటర్లకు వెళ్లే పరిస్థితులు లేవని, ప్రజలను థియేటర్లకు రమ్మనడం కరెక్ట్​ కాదని.. కరోనాతో ఎవరు నష్టపోకూడదనే ఓటీటీకి ఇచ్చినట్లు సురేశ్​బాబు పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-