యథా కాలమ్ తథా వ్యవహారమ్… సురేందర్ రెడ్డి, పవన్ మూవీ అప్డేట్

పవన్ బర్త్ డే వేడుకలను మరింత ప్రత్యేకం చేయడానికి ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి వంతు వచ్చింది. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సురేందర్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో “యథా కాలమ్ తథా వ్యవహారమ్…” అంటూ ఒక గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్, సైబర్ టవర్ ను చూపించడం ఆసక్తికరంగా ఉంది. ప్రీ లుక్ తోనే యాక్షన్ మూవీ అని చెప్పేశారు మేకర్స్. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు.

Read Also : “హరి హర వీర మల్లు” అప్డేట్ అదిరింది !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి వరుస అప్డేట్స్ రావడంతో మెగా అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ నేడు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు నిన్ననే ప్రకటించారు. “వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన పవన్ తరువాత వరుస సినిమాలను లైన్ లో పెట్టేశారు.

ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న “భీమ్లా నాయక్” నుంచి ఉదయాన్నే అప్డేట్ వచ్చేసింది. “భీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఇక 1.20 గంటల సమయంలో పవన్ నెక్స్ట్ మూవీ “హరి హర వీరమల్లు” నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్ “హరి హర వీరమల్లు” పోస్టర్ ను రిలీజ్ చేస్తూ పవన్ కు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టర్ ద్వారా “హరిహర వీరమల్లు”ను 2022 ఏప్రిల్ 29న విడుదల చేస్తామంటూ ప్రకటించి బిగ్ అప్డేట్ ఇచ్చారు.

Related Articles

Latest Articles

-Advertisement-